భారత్ సమాచార్, అమరావతి ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో, దేవాదాయ శాఖలో సంచలనం సృష్టించిన ఫిర్యాదు పై దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి మీడియాకు వివరణ ఇచ్చారు. మదన్ మోహన్ అనే వ్యక్తి తన మాజీ భర్త అని చెప్పారు. తనకు, మదన్ మోహన్ కు 2013 లో వివాహం జరిగిందని, 2016 లో విడాకులు కూడా తీసుకున్నామని తెలిపారు. తనకు మదన్ మోహన్ కు ఇద్దరు కవల పిల్లల సంతానం ఉన్నారని ఆమె చెప్పారు. విడాకుల తర్వాత సుభాష్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుత భర్త గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్‌కు కూడా ఇది రెండో వివాహం అని తెలిపారు. రెండో వివాహం తర్వాత మాకు బాబు పుట్టాడని చెప్పారు. వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డికి, తనకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయన కూతురు వయస్సు ఉన్న నాపై నా మాజీ భర్త అనుచిత వ్యాఖ్యలు చేశారు. నాకు, నా మాజీ భర్తకు మధ్య ఆర్థిక పరమైన వ్యవహారాలు ఉన్నాయి. వాటి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. కేవలం తనను అల్లరి పాలు చేయటానికే తన మాజీ భర్త మదన్ మోహన్ తన బిడ్డకు తండ్రి విజయసాయి రెడ్డి నా? లేక సుభాష్ నా? తేల్చాలని తన శాఖ అధికారికి లెటర్ ఇచ్చాడని శాంతి ఆరోపించారు. తన వయస్సు 35 సంవత్సరాలని, విజయసాయి రెడ్డి వయస్సు 68 సంవత్సరాలని , మా ఇద్దరి మధ్య అక్రమ సంబంధం అన్న ఆరోపణలు చేయటానికి అర్థం వుండాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.