భారత్ సమాచార్.నెట్, మెదక్: చిన్నశంకరంపేటలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆటో ట్రాలీని బైక్ ఢీకొట్టడంతో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆటో ట్రాలీని వెనక నుంచి వచ్చిన బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఒకరికి తీవ్ర గాయాలవ్వగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తులను జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మరిన్ని కథనాలు
Share This Post