July 28, 2025 5:23 pm

Email : bharathsamachar123@gmail.com

BS

Baahubali: బాహుబలికి పదేళ్లు.. ఒకే పార్ట్‌గా గ్రాండ్ రిలీజ్! 

భారత్ సమాచార్.నెట్: తెలుగు సినిమాను ప్రపంచానికి చాటిచెప్పిన చిత్రం ‘బాహుబలి’. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్‌ వంటి నటినటులు నటించిన సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ విడుదలై నేటికి అంటే జూలై 10కి పదేళ్లు పూర్తి అయ్యాయి. 2015లో ‘బాహుబలి ది బిగినింగ్’ థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం సినీ ప్రియులను అల్లరించేందుకు మరోసారి థియేటర్లకు వచ్చేందుకు సిద్ధమైంది.
అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం థియేటర్లల్లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. స్టార్ హీరోల సూపర్ హిట్ చిత్రాలను థియేటర్లల్లో విడుదల చేస్తే కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే.. రాజమౌళి మాత్రం ఈ ట్రెండ్‌ ఫాలో కాకుండా తన స్టైల్‌లో ఈ రిలీజ్ విషయంలోనూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. ‘బాహుబలి ‌ది బిగినింగ్’, ‘బాహుబలి ది కంక్లూజన్’ రెండు భాగాలను కలిపి ఒక్కటే సినిమాగా విడుదల చేయడానికి రాజమౌళి రెడీ అవుతున్నారు. ఆ సినిమాకు ‘బాహుబలి’ ది ఎపిక్’ అని పేరు పెట్టారు.
బాహుబలి ది ఎపిక్ సినిమాను ఈ ఏడాది అక్టోబర్ 31న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు రాజమౌళి ప్రకటించారు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు ఆ తర్వాత అక్టోబర్ 31న థియేటర్లల్లో సందడి చేయనుంది. ఇకపోతే ఈ సినిమా పదేళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో బహుబలి వస్తున్నాడు అని హ్యాష్ ట్యాగ్‌తో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. మరోసారి బాహుబలి చిత్రానికి సంబంధించిన పోస్టులు, పాటలు, సన్నివేశాలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.
Share This Post
error: Content is protected !!