August 3, 2025 10:42 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

బీజేపీకి మద్ధతుగా నిలవాలి: శాంతికుమార్

భారత్ సమాచార్.నెట్, నాగర్‌కర్నూల్ జిల్లా: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ చేపట్టిన ‘ఇంటింటికి బీజేపీ – ప్రతి ఇంటికి బూత్ అధ్యక్షుడు’ కార్యక్రమం తిమ్మాజీపేట మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా, బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

మోడీ పాలనలో దేశం అభివృద్ధి:
ప్రధాని రేంద్ర మోడీ నాయకత్వంలో గత 11 ఏళ్లుగా దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, పేదలకు సంక్షేమ పథకాలు, రైతులకు ఆర్థిక సాయంతో కేంద్రప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. దేశాన్ని నాల్గో ఆర్థిక శక్తిగా మార్చడంలో మోడీ కీలక పాత్ర వహించారన్నారు. మోడీ నిరుపేదల కోసం అమలు చేస్తున్న ప్రధాన పథకాలలో ఉచిత బియ్యం పంపిణీ, కిసాన్ సమ్మన్ నిధి ద్వారా ప్రతి రైతుకు రూ.2,000 మద్దతు, మహిళలకు ఉజ్వలా గ్యాస్ కనెక్షన్లు, గ్రామాభివృద్ధి కోసం సీసీ రోడ్లు, వీధిదీపాలు, మరుగుదొడ్లు, స్మశాన వాటికలు, రైతుల కోసం వాటర్ డ్రిప్ సిస్టమ్, సబ్సిడీ ఎరువులు వంటి పథకాలను అందిస్తున్నారని ఆయన వివరించారు.

బీజేపీకి మద్ధతుగా నిలవాలి:
ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ మోడీ పాలనలో అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే కరపత్రాలు పంపిణీ చేస్తూ అందులో పొందుపరిచిన ఫోన్ నంబర్‌కు మిస్‌డ్ కాల్ చేయమని ప్రజలను కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. “ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం బీజేపీదే” అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు జట్టి వెంకటేష్ (మాజీ MPP), నాగేందర్ గౌడ్, రాష్ట్ర మాజీ కౌన్సిల్ సభ్యుడు నారాయణ చారి, దాచేపల్లె వేణు, శివలింగం, బూత్ అధ్యక్షులు యాదిలాల్, నీలా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Share This Post