Homemain slidesబాస‌ర ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేష‌న్ విడుదల

బాస‌ర ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేష‌న్ విడుదల

భారత్ సమాచార్, హైదరాబాద్ ;

తెలంగాణ రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్  టెక్నాలజీస్ (ఆర్జీయూకేఈ– బాసర ట్రిపుల్ ఐటీ)లో ఆరేళ్ల ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశాలకు అధికారులు తాజాగా నోటిఫికేషన్ ను రిలీజ్ చేశారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన రాష్ట్ర విద్యార్థులు దరఖాస్తు చేయటానికి అర్హులు. ప్రభుత్వ పాఠశాలో ఉత్తీర్ణత సాధించిన గ్రామీణ విద్యార్థులకు అధిక శాతం సీట్లను కేటాయిస్తారు. 2024 25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అసక్తి కల విద్యార్ధులు ఆన్‌లైన్‌లో  https://www.rgukt.ac.in/ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.  జూన్ 1వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 22వ తేదీ దరఖాస్తు చేయటానికి చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం అధికార వెబ్ సైట్ లేదా ఈ-మెయిల్ (admissions@rgukt.ac.in) ద్వారా కూడా సంప్రదించవచ్చు. మెరిట్ లిస్ట్ లోఆరేళ్ల ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను వెబ్ సైట్ లో పొందుపరచనున్నారు.

పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ను తయారు చేస్తారు. అయితే గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల కోసం మొదటి ప్రాధాన్యత ఉంటుంది. రాష్ట్రంలోని ప్రముఖ విద్యా సంస్థల్లో ట్రిపుల్ ఐటీ ఒకటి. ఒక్క సారి ఇందులో సీటు లభిస్తే ఉచితంగా ఆరేళ్ల పాటు విద్యాభ్యాసం, హాస్టల్ వసతి లభిస్తుంది. ఉత్తమ విద్యా వ్యవస్థ ట్రిపుల్ ఐటీ లో ఉంటుంది.

మరికొన్ని కథనాలు…

రాష్ట్రంలోని ప్రతీ బడీ.. ఒక అమ్మ ఒడి

RELATED ARTICLES

Most Popular

Recent Comments