Homemain slidesHair &Nails: ఈ రోజులలో జుట్టు, గోర్లు కత్తిరిస్తున్నారా?

Hair &Nails: ఈ రోజులలో జుట్టు, గోర్లు కత్తిరిస్తున్నారా?

భారత్ సమాచార్.నెట్: శాస్త్రాల ప్రకారం గోర్లు (Nails) కట్ చేసుకోవడం, జుట్టు (Hair) కత్తిరించుకోవడం, గడ్డం (Beard) చేసుకువడం వంటివి వీలుని బట్టి చేస్తుంటారు. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఎప్పుడు పడితే అప్పుడు ఈ పనులు చేయకూడదంట.. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ సమయంలో గ్రహాల అశుభ ప్రభావం మీపై పడుతుందని, దీంతో మీరు పేదరికంలో కూరుకుపోయే ప్రమాదం ఉందంటున్నారు.

శాస్త్రాల ప్రకారం, జుట్టు కత్తిరించుకోవాలనుకుంటే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు మాత్రమే ఈ పని పూర్తి చేయాలి. సోదరులుగా ఉండేవారు కూడా ఒకేరోజున హెయిర్ కట్ చేసుకోకూడదు. అయితే సోమవారం రోజున జుట్టు కత్తిరించుకుంటే ఆదాయం పెరుగుతుంది. కానీ సంతానం కోసం ఎదురుచూసేవారు, ఒక్కరే కొడుకు ఉండే వారు సోమవారం రోజున జుట్టు పొరపాటున కూడా కత్తిరించరాదు. ఇలా చేయడం వల్ల అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది.
మంగళవారం: ఈ రోజున గోళ్లను కత్తిరించడం ఏ మాత్రం మంచిది కాదు. పొరపాటున కట్ చేస్తే ఆయుష్ తగ్గిపోతుందని జ్యోతిష్యం చెబుతుంది. అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు తగ్గుతాయి. శాస్త్రం ప్రకారం మంగళవారం రోజు ఇలాంటి అనేక పనులు నిషేదం. జుట్టు కత్తిరించడం వల్ల మీలో కోపం పెరిగే అవకాశం ఉంటుంది. బుధవారం రోజు గోళ్లు, జుట్టు, గడ్డం వంటివి కత్తిరించుకోవడం పవిత్రంగా పరిగణిస్తారు. ఇలా చేయడం వల్ల ఆర్థిక లాభం చేకూరుతుంది.ల క్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. అంతేకాకుండా బుధుడి అనుగ్రహంతో నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది.
ఇక గురువారం జుట్టు కత్తిరించినట్లయితే, లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అంతేకాదు గురుడి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి గురువారం రోజున పొరపాటున కూడా గురువారం నాడు జుట్టు, గోర్లు, కత్తిరించొద్దు. శుక్రవారం అన్ని రోజులతో పోలిస్తే ఈ రోజు జుట్టు, గోర్లు కత్తిరించుకోవడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతారు. ఇలా చేయడం వలన జీవితంలో సంబంధాలు బలపడతాయి. ఇక శనివారం రోజున గోర్లు, జుట్టు కత్తిరించుకోవడం శుభప్రదంగా పరిగణించబడదు. అలా చేయడం వల్ల జాతకంలో శని బలహీనుడు అవుతాడని జోతిష్యం చెబుతోంది. శని గ్రహా ఆగ్రహానికి గురై దరిద్రం వెంటాడుతుంది. ఇక ఆదివారం జుట్టు కత్తిరించుకోవడం, గడ్డం చేసుకోవడం వల్ల ప్రతికూల ప్రభావం పడుతుంది. మీరు ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
RELATED ARTICLES

Most Popular

Recent Comments