Homebreaking updates newsCars: బైక్ కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారులు ఇవే

Cars: బైక్ కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారులు ఇవే

భారత్ సమాచార్.నెట్: మీరు రోజూ ఆఫీసుకు లేదా ఇతర పనుల కోసం కారు (Car) కొనాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. కారు కొనాలని భావిస్తే ముందుగా చూడాల్సిన అంశం మైలేజ్(Mileage). మైలేజ్ బాగా ఉంటే డైలీ అప్ అండ్ డౌన్‌కు ఈజీగా ఉంటుంది. అదే సమయంలో ఆ కార్ ధర మీ బడ్జెట్‌లో ఉండడం కూడా ముఖ్యమేనండోయ్. మీ బడ్జెట్‌కు.. అలాగే మీ అవసరాలకు సరిపోయే కారు కోసం సెర్చ్ చేస్తుంటే.. ఈ కథనం మీ కోసమే.

ప్రస్తుతం బెస్ట్ మైలేజ్ ఇచ్చే కొన్ని కార్లు మార్కెట్లో అందూబాటులో ఉన్నాయి. ఇందులో మారుతి సుజుకి బ్రాండ్‌కు చెందినవి ఒకటైతే.. రెండోది టాటా మోటార్స్‌ కారు. కంపెనీల వెబ్‌సైట్‌ల ప్రకారం.. ఈ కార్లు ఒక్క కిలో CNGతో 27 కిలోమీటర్ల నుంచి 34 కిలోమీటర్ల వరకు మైలేజ్‌ ఇస్తాయి. అంటే బైక్‌తో పోల్చితేనూ తక్కువ ఖర్చుతో అధిక మైలేజ్‌ను అందిస్తాయన్నమాట.
అలాగే మారుతి సుజుకి సెలెరియో CNG 998cc కారులో 3 సిలిండర్ ఇన్‌లైన్ ఇంజన్‌తో పనిచేస్తుంది. DOHC టెక్నాలజీ ఆధారంగా ఈ ఇంజన్‌ 56 bhp పవర్‌ & 82.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సేఫ్టీ కోసం సెలెరియో CNGలో 6 ఎయిర్‌ బ్యాగులు, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), EBDతో కూడిన ABS, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం ఈ కార్‌ ఒక కిలో CNGతో 34.43 కిలోమీటర్లు మైలేజ్ ఇస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 6.89 లక్షలు.
ఈ రెండిటితో పాటు టాటా టియాగో CNG 1199cc 3 సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ప్రతి సిలిండర్‌కు 4 వాల్వ్‌లు ఉంటాయి. ఈ ఇంజిన్ కూడా DOHC టెక్నాలజీతో పని చేస్తూ, 74 bhp పవర్‌ & 96.5 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్‌, ESP, హిల్ హోల్డ్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు 1 కిలో CNGతో 26.49 కిలోమీటర్ల మైలేజ్‌ను అందిస్తుంది. టియాగో CNG ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.99 లక్షల నుంచి రూ. 9.49 లక్షల వరకు ఉంటుంది. వీటితో పాటు మారుతి సుజుకి ఆల్టో K10 CNG కూడా తక్కువ బడ్జెట్‌లో అందుబాటులో ఉంది.
RELATED ARTICLES

Most Popular

Recent Comments