భారత్ సమాచార్, జాతీయం ;
షెల్డ్యుల్ క్యాస్ట్ (ఎస్సీ), షెల్డుల్ ట్రైబ్ (ఎస్టీ) వర్గీకరణ పై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కొందరు స్వాగతిస్తే కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ,ఎస్టీ విభజన, క్రిమిలేయర్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి తెలిపింది. కుట్రపూరితంగా ఎస్సీ, ఎస్టీల్లో విబేధాలు సృష్టించడానికి ఈ వర్గీకరణను తీసుకొచ్చారని ఆ సమితి ఆరోపించింది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా తాము పోరాటాలు చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా ఈ నెల ఆగస్టు 21వ తేదీన దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపింది. దేశంలో వివిధ సమస్యలపై తీవ్ర ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. మణిపూర్ అల్లర్లతోపాటు పశ్చిమ బెంగాల్‌లో డాక్టర్ హత్యాచార సంఘటనతో దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యాపిస్తున్నాయి. ఇక రైతులు కూడా తమ డిమాండ్‌లపై మరోసారి తీవ్రస్థాయిలో ఉద్యమం నడిపేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మరో ఉద్యమం రాజుకుంటోంది. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఉద్యమిస్తామని ఓ సంఘం ప్రకటించింది. అందులో భాగంగా భారత్ బంద్‌కు ఆ సంఘం పిలుపునిచ్చింది.