July 28, 2025 5:29 pm

Email : bharathsamachar123@gmail.com

BS

ఇక పై ఫోన్ పే, గూగుల్ పే లో ఆ బిల్లులు కట్టలేం

భారత్ సమాచార్, హైదరాబాద్ ;

తెలంగాణలో కరెంట్‌ బిల్లుల చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్. రాష్ట్ర విద్యుత్ వినియోగదారులకు TGSPDCL తాజాగా కీలక సూచనలు జారీ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాల ప్రకారం సర్వీస్ ప్రొవైడర్లయిన ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే, గూగుల్ పే, బ్యాంకుల ద్వారా కరెంటు బిల్లులు చెల్లింపులు నిలిపివేసినట్లు నేడు అధికారికంగా ప్రకటించింది. ఈ ఆదేశాలు నేటి నుంచే అమలు చేస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఈ క్రమంలో నేటి నుంచి TGSPDCL వెబ్సైట్/ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే నెలవారీ కరెంట్ బిల్లులు చెల్లించాలని రాష్ట్ర వినియోగదారులను సంస్థ కోరింది.

మరికొన్ని తాజా విశేషాలు…

రాజధాని భౌగోళిక పరిధి పెంపు

 

Share This Post
error: Content is protected !!