భారత్ సమాచార్.నెట్, నాగర్ కర్నూల్: వెల్దండ మండలం రాఘాయిపల్లి గేట్ వద్ద గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై పెళ్లి పనుల నిమిత్తం పుట్టమన్ను తీసుకురావడానికి నడుచుకుంటూ వెళ్తున్న రాఘాయిపల్లికి చెందిన శవ మల్లేష్, శవ పెంటయ్యలతో పాటు మరో వ్యక్తిని ఓ బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురికి, బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన శవ మల్లేష్ (40)ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా, శుక్రవారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని కథనాలు