భారత్ సమాచార్.నెట్: ఏపీ(Ap) నుంచి రాజ్యసభ (Rajya Sabha) అభ్యర్థిగా బీజేపీ నేత (BJP Leader) పాకా వెంకట సత్యనారాయణ (Paka Venkata Satyanarayana) మంగళవారం నామినేషన్ (Nomination) దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాలను అందించారు పాకా వెంకట నారాయణ. నామినేషన్ పత్రాల దాఖల సమయంలో ఆయన వెంటన కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్, సోము వీర్రాజు, తదితరులు ఉన్నారు. ఇక నామినేషన్ వేసిన అనంతరం సీఎం చంద్రాబాబును కలిశారు సత్యనారాయణ.
ఇదిలా ఉంటే రాజ్యసభ సభత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల కమిషన్ ఉప ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఇవాళ్టి వరకు అభ్యర్థులు తమ నామినేషన్లు వేశారు. అయితే కూటమి నుంచి రాజ్యసభ బరిలో నిలిచేది ఎవరు అనే చర్చ జరుగుతున్న సమయంలో.. టీడీపీ, జనసేన.. ఆ స్థానాన్ని బీజేపీకి వదిలేసింది. అభ్యర్థి ఎంపికపై బీజేపీ కేంద్ర నాయకత్వం మంగళవారం (ఏప్రిల్ 29) నామినేషన్ గడువు ముగిసే ముందు అధికారిక ప్రకటన చేసింది.
పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేస్తూ వస్తున్న పాక వెంకట సత్యనారాయణ పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించడంతో ఆయన ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. వెనుకబడిన వర్గాలకు చెందిన పాక వెంకట సత్యనారాయణ స్వస్థలం భీమవరం. న్యాయవాద వృత్తిలో కొంతకాలం కొనసాగిన ఆయన 1976లో ఆర్ఎస్ఎస్‌లో చేరి క్రియాశీలకంగా వ్యవహరించారు.ఆయన 1996లో నర్సాపురం లోకసభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేశారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖలో క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.