August 5, 2025 1:11 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

BRS బీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం.. దేనికి సంకేతం..?

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రధాన పార్టీల నాయకులు ఓట్లను ప్రసన్నం చేసే పనిలో పడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ తేదీల ప్రకటన రానేరాలేదు అప్పుడే కుల ఆత్మీయ సమ్మేళనాలు, సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు విమర్శలు సంధించుకుంటున్నారు. మరొవైపు తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా దెబ్బ మీద దెబ్బ కొడుతూ ముందుకెళ్తుంది. మొన్న ఫోన్ ట్యాపింగ్, తాజాగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టు అంటూ.. ముప్పేట దాడితో బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇదే అదునుగా బీజేపీ కూడా తనదైన శైలిలో పావులు కదుపుతోంది. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసి పార్టీలో చేర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. దీంతో తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీకి గడ్డు కాలం నడుస్తుందనే చెప్పాలి.

బీసీ రిజర్వేషన్‌పై బీఆర్ఎస్ గురితప్పింది:
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు కొనసాగుతుండగానే, మరోవైపు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ రూపంలో బీఆర్ఎస్‌ పార్టీ నేతలపై మరో పిడుగు పడింది. దీంతో నేడో, రేపో స్థానిక ఎన్నికలంటూ హీట్ కొనసాగుతున్న వేళ.. వరుసగా బీఆర్ఎస్‌ పార్టీకి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముప్పేట దాడి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో హాట్ టాపిక్ అయిన బీసీ రిజర్వేషన్ అంశంపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేయలేకపోతుంది.
కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్‌లో బీఆర్ఎస్‌ పార్టీ కీలక నేతలను టార్గెట్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్, హరీష్‌రావు పేర్లు ప్రస్తావించడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు రివర్స్ ఎటాక్‌ చేస్తున్నారు. అది కమిషన్ రిపోర్ట్ కాదు.. కాంగ్రెస్ రిపోర్ట్ అని మాజీ సీఎం కేసీఆర్ విమర్శించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే నేడు మాజీ మంత్రి హరీష్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ:
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ క్రమక్రమంగా తన ప్రభావాన్ని కోల్పోతుందనే చెప్పక తప్పదు. ఎందుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లోనే కాక ఎంపీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో ఈ-కార్ రేసింగ్, విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్ట్, ఫోన్ ట్యాపింగ్ కేసులపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిసారించి బీఆర్ఎస్ నాయకులను దోషులుగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్‌ను బీజేపీ కూడా దెబ్బ కొడుతుంది. బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న నాయకులకు గాలం వేసి బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అచ్చంపేట మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును తమ దారికి తెచ్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఈ నెల 9వ తేదీన ఆయన బీజేపీలో చేరునున్నట్లు సమాచారం.

బీఆర్ఎస్ పార్టీకి దూరంగా, సొంత ఎజెండాతో ముందుకు:
ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు, ఈ-కార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సతమతం అవుతుంటే మరొవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతుంది. దీనిలో భాగంగానే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ పెంచాలని మూడు రోజుల నిరాహార దీక్ష చేస్తున్నారు. మొన్న జగదీశ్వర్ రెడ్డి వ్యవహారం, అంతకు ముందు కేసీఆర్‌కు ఎవరో తను రాసిన లేఖలను లీక్ చేస్తున్నారని కవిత ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు కవిత దూరంగా ఉంటూ సొంత ఎజెండాతో ముందుకెళ్తున్నట్లు సమాచారం.

Share This Post