August 7, 2025 12:10 am

Email : bharathsamachar123@gmail.com

Breaking

Meta gala: మెట్ గాలాలో మెరిసిన కియారా అద్వానీ, షారుఖ్ ఖాన్

భారత్ సమాచార్.నెట్: ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్‌(Fashion Event) మెట్ గాలా (Meta gala). ఈ ఫ్యాషన్ ఈవెంట్‌లో వివిధ దేశాలకు చెందిన సెలబ్రిటీలు (Celebrities) అబ్బురపరిచే ఫ్యాషన్ లుక్స్‌లో తళుక్కుమంటారు. ప్రతి ఏడాది మే నెలలో న్యూయార్క్‌ (Newyork)లో జరిగే ఈ వేడుక ప్రపంచ ఫ్యాషన్ ప్రపంచానికి ఒక పెద్ద పండుగ. ఇది కేవలం ఒక ఫ్యాషన్ ప్రదర్శన మాత్రమే కాదు.. కళ, సంస్కృతి, వ్యక్తిత్వం అన్నింటినీ ప్రతిభింభించే గొప్ప వేదిక.

మెట్ గాలా కార్యక్రమాన్ని న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (Metropolitan Museum of Art) లోని కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ (Costume Institute) నిర్వహిస్తుంది. ఈ ఈవెంట్ ద్వారా సేకరించిన డబ్బుతో మ్యూజియంలోని ఫ్యాషన్ విభాగాన్ని అభివృద్ధి చేస్తారు. ఇక ప్రపంచవ్యాప్తంగా సినీ, ఫ్యాషన్, సంగీత రంగానికి చెందిన ప్రముఖులు ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌లో పాల్గొన్న వారిలో.. భారత సినీ తారలు కూడా తళుక్కుమన్నారు.
బాలీవుడ్ గ్లామర్ క్వీన్ కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ఏడాది తొలిసారి మెట్ గాలా కార్యక్రమానికి హాజరైన సెలబ్రిటీల్లో కియారా అద్వానీ ఒకరు. గర్భవతిగా ఉన్న కియారా, ఈ కార్యక్రమానికి బేబీ బంప్‌తో హాజరై అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రఖ్యాత భారతీయ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన డిజైనర్ గౌన్‌లో ఆమె మెరిసిపోయింది. ఆమె లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. కియారాతో పాటు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, దిల్జిత్, ప్రియాంకా చోప్రా, ఇషా అంబానీ సందడి చేశారు. ఈ వేడుకలో పాల్గొన్న సెలబ్రిటీల ఫొటోలు ప్రస్తుతం వైరలవుతున్నాయి.
Share This Post