July 28, 2025 8:19 am

Email : bharathsamachar123@gmail.com

BS

BSE: కోట్లల వ్యాపారం జరిగే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు బాంబు బెదిరింపులు..!

భారత్ సమాచార్.నెట్, ముంబై: దేశ వ్యాణిజ్య రాజధాని ముంబైలోని కోట్లలో వ్యాపారం జరిగే బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. భవనంలో నాలుగు ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తులు మెయిల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. బీఎస్ఈ భవనంలో 4 ఆర్డీఎస్, ఐఈడీ బాంబులు పెట్టామని.. అవి ఈరోజు పేలుతాయని  కామ్రేడ్ పినరయి విజయన్ పేరుతో ఈ బెదిరింపు సందేశం వచ్చినట్లు సమాచారం.
మరోవైపు బాంబు బెదిరింపులు నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైన అధికారులు బాంబ్ స్క్వాడ్ బృందాలు, భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని, నకిలీ బెదిరింపు అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు వెల్లడించారు. ఈ మెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందో తేల్చే పనిలో అధికారులు ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవలే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారిక నివాసానికి కూడా బాంబు బెదిరింపు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక దేశ రాజధాని ఢిల్లీలోని కొన్ని కళాశాలలు కూడా బాంబు బెదిరింపులతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్‌, సెయింట్ థామస్ స్కూల్‌కు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు సమాచారం. ఇక దేశవ్యాప్తంగా పలువురు అధికారుల నివాసాలు, ఆస్పత్రులు, కళాశాలలకు ఇటీవలి కాలంలో ఇలా నకిలీ బాంబు బెదిరింపులు వస్తుండటంపై అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
Share This Post
error: Content is protected !!