భారత్ సమాచార్.నెట్, రంగారెడ్డి జిల్లా: యాచారం మండలంలోని ధర్మన్నగూడ గ్రామంలో ఆదివారం పోచమ్మ , మహంకాళి బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహంకాళి, పోచమ్మ అమ్మవార్లకు మహిళలు పెద్దఎత్తున బోనాలు నెత్తిన పెట్టుకుని ఆలయం వద్దకు చేరుకుని అమ్మవార్లకు బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. అమ్మవార్ల ఆశీస్సులతో ధర్మన్నగూడ గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని కోరారు. భక్తిశ్రద్ధలతో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. దీంతో ధర్మన్నగూడ గ్రామంలో బోనాలు సందడి వాతావరణం నెలకుని ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ వేడుకల్లో పోతురాజుల నృత్యాలు, శివసత్తుల విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి.