భారత్ సమాచార్.నెట్, యాదాద్రి భువనగిరి: బీబీనగర్ మండలం రావిపహాడ్ గ్రామంలో ఆదివారం బోనాల పండుగ ఘనంగా జరిగింది. సంప్రదాయబద్దంగా మహిళలు పోచమ్మ అమ్మవారికి భక్తి శ్రద్దలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలు పెద్దఎత్తున బోనాలతో గ్రామం నుంచి ఆలయం వద్దకు చేరుకుని బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పోచమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా పండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని గ్రామస్థులు పూజలు చేశారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు
Share This Post