భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: భారత్, పాకిస్థాన్ (India, Pakistan) మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) భారత్ రక్షణ శాఖ (India Defence Budget)ను మరింత బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిఫెన్స్‌కు కేటాయించే బడ్జె్ట్‌ను మరింత పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. రక్షణ రంగానికి రూ. 50 వేల కోట్ల మేర బడ్జెట్‌లో అదనపు కేటాయింపులు చేపట్టవచ్చని తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ అనంతరం కేంద్రం ఈ దిశగా అడుగులు వేస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం రక్షణ శాఖకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6.81 లక్షల కోట్లు కేటాయించగా.. తాజాగా పెంపునకు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఆమోదం లభించే అవకాశాలున్నాయి. దీంతో డిఫెన్స్‌కు కేటాయించిన నిధులు రూ.7 లక్షల కోట్లు దాటుతాయని అర్థమవుతోంది. కాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత రక్షణ బడ్జెట్లో సాంకేతిక పరిజ్ఞానం, మందుగుండు సామగ్రి కొనుగోలు, కొత్త ఆయుధాల ఖర్చులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ మేరకు ఆలోచన చేసినట్లు సమాచారం.
భద్రతాపరమైన కారణల వల్ల చైనా పకిస్థాన్ నుండి ఎదురవతున్న తరుణంలో.. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.6,81,210 కోట్లను ప్రతిపాదించింది. 2024-25 బడ్జెట్ కేటాయింపుల (రూ.6.22 లక్షల కోట్లు)తో పోలిస్తే.. ఇది 9.53 శాతం అధికం. అలాగే సవరించిన అంచనాలతో పోలిస్తే ఇది 6.2 శాతం ఎక్కువ.