భారత్ సమాచార్.నెట్,చండీగఢ్: తన గర్ల్‌ఫ్రెండ్‌ను కలవాలనే ఉద్దేశంతో ఓ విద్యార్థి (Student) అతి విచిత్రమైన మార్గాన్ని ఎంచుకుని పెద్ద సాహసమే చేశాడు. ఎవరి కంటబడకుండా తన హాస్టల్ (Hostel) గదికి గర్ల్‌ఫ్రెండ్ (GirlFriend)ను తీసుకొచ్చేందుకు స్కెచ్ వేశాడు విద్యార్ధి. ఆమెను ఓ సూట్‌కేసు (Suitcase)లో దాచిపెట్టి తీసుకురావడానికి ప్రయత్నించగా.. అడ్డంగా దొరికిపోయాడు (Caught).
అతడు తీసకొస్తున్న సూట్‌కేసు అనుమానాస్పదంగా (Suspicious) ఉండటంతో సెక్యూరిటీ సిబ్బంది అపి.. చెక్ చేశారు. దీంతో అతడి ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. హర్యానా (Haryana)లోని సోనిపట్(Sonipat) ప్రాంతంలో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయం(OP Jindal University)లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ విద్యార్థి పెద్ద సూట్‌కేసుతో హాస్టల్‌లోకి వస్తుండగా, సిబ్బంది అందులో ఏముందని అడిగారు. దానికి అతడు దుస్తులు, ఇతర వ్యక్తిగత వస్తువులున్నాయని చెప్పాడు. కానీ అతడి ప్రవర్తనపై హాస్టల్ గార్డులకు అనుమానం రావడంతో వారు సూట్‌కేస్ తెరవాలని అడిగారు. కానీ విద్యార్థి అందుకు నిరాకరించాడు. దాంతో విషయం ఉన్నతాధికారులకు చెప్పడంతో.. అక్కడికి చేరుకున్న వారు సూట్‌కేస్‌ను తెరవగా అందులో ఆశ్చర్యకరంగా ఓ యువతి బయటపడింది. ఈ తతంగాన్ని అక్కడే ఉన్న ఓ విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే సూట్‌కేసులో బయటపడిన అమ్మాయి అదే యూనివర్సిటీలో చదువుతుందా లేక బయట నుంచి వచ్చిందా అనే విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనపై యూనివర్సిటీ యాజమాన్యం విచారణ జరుపుతోంది. మరోవైపు ఈ ఘటనపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తు్న్నారు. ఈ మధ్య సూట్‌కేసులు ఎన్నో పనులకు ఉపయోగపడుతన్నట్లు ఉన్నాయి అంటూ కామెంట్ చేశాడు. ఈ వీడియోపై సోషల్ మీడియాలో మీమ్స్, జోకులు తెగ పేలుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన సంబంధించిన వీడియో కోసం ఈ లింక్‌పై క్లీక్ చేయండి.