July 29, 2025 4:48 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

దైవ దర్శనానికి వెళ్లి.. కళ్లముందే మృత్యుఒడిలోకి

భారత్ సమాచార్.నెట్, సూర్యాపేట: రోడ్డు దాటుతున్న బాలుడిని వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టడంతో మూడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన ఆత్మకూర్(ఎస్) మండలంలోని సూర్యాపేట-ఖమ్మం రహదారి పక్కన నెమ్మికల్ దండుమైసమ్మ అమ్మవారి ఆలయం వద్ద చోటుచేసుకుంది. కట్టంగూరు మండలం తేలువారిగూడెం గ్రామానికి చెందిన గట్టిగొర్ల మహేష్, శ్రావణి దంపతుల పెద్ద కుమారుడు మోక్షిత్(3)తో కలిసి నెమ్మికల్ వద్దనున్న దండుమైసమ్మ ఆలయానికి మొక్కులు తీర్చుకునేందుకు కుటుంబ సమేతంగా వెళ్లారు.

మోక్షిత్ తండ్రి మహేష్ వద్ద నుంచి రోడ్డుపై ఉన్న తన తాత వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో మోక్షిత్ రోడ్డు దాటుతుండగా TS29T 2334 నెంబర్ గల ట్రాక్టర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ట్రాక్టర్ టైర్ చిన్నారిపై వెళ్లడంతో తీవ్ర గాయాలైన బాలుడిని హుటాహుటిన సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మోక్షిత్ మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై బాధిత కుటుంబసభ్యులు ఆత్మకూర్(ఎస్) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తన కుమారుడు కళ్లముందే మృతి చెందడంతో బాధిత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకుంది.

Share This Post