August 5, 2025 10:18 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

పెళ్లయిన కొన్ని గంటల్లోనే నవవధువు బ‌ల‌వ‌న్మ‌ర‌ణం

భార‌త్ స‌మాచార్‌.నెట్‌, శ్రీ సత్యసాయి: జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షిత (22) వివాహం సోమవారం ఉదయం కర్ణాటకలోని బాగేపల్లి పరిధి దిబ్బూరిపల్లికి చెందిన నాగేంద్రతో ఘనంగా జరిగింది. అయితే, పెళ్లయిన కొన్ని గంటల్లోనే నవవధువు బలవన్మరణానికి పాల్పడటం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

నూతన దంపతులకు సోమందేపల్లిలో మొదటిరాత్రి వేడుక నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తుండగా, హర్షిత తన గదిలోకి వెళ్లి పైకప్పునకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు గది తలుపులు పగలగొట్టి చూడగా, ఆమె విగతజీవిగా కనిపించింది. హుటాహుటిన పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై రమేశాబాబు తెలిపారు.

 

మ‌రిన్ని క‌థ‌నాలు

ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Share This Post