August 3, 2025 10:32 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

ఆయన ఒక లిల్లీపుట్ నాయకుడు: ఎమ్మెల్సీ కవిత

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తాజాగా బీఆర్ఎస్ పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శించారు. జగదీష్ ఒక లిల్లీపుట్ నాయకుడు అని హాట్ కామెంట్స్ చేశారు. తనపై జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వెనుక ఒక బీఆర్ఎస్ పార్టీ కీలక నేత ఉన్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలతో మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి.

నాపైనే అంత నీచంగా మాట్లాడతావా:
సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని, నా వెనుక తెలంగాణ ప్రజలు ఉన్నారని, తనను ఎవరు ఎంత ఇబ్బంది పెట్టినా తెలంగాణ ప్రజలు తమకు అండగా ఉంటారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ పార్టీని నాశనం చేసిందే జగదీష్‌రెడ్డి అని మండిపడ్డారు. నా మీదే నీచంగా మాట్లాడతారా? ఇదేనా రాజకీయం? అని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ దగ్గర రాజకీయం నెర్చుకుని సొంత పార్టీ నాయకులపై ఇలా మాట్లాడుతారా అని ప్రశ్నించారు. నా తండ్రికి రాసిన లేఖను బహిర్గతం చేశారని అన్నారు. బీఆర్ఎస్‌ నాయకులే.. నాపై అనుచితంగా మాట్లాడిస్తున్నారని దుయ్యబట్టారు. కాగా ఇటీవల ఒక మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కవితను టార్గెట్ చేస్తూ ఆమె గురించి మాట్లాడి టైమ్ వేస్ట్ అని, ఆమెను పట్టించుకోవడం అవసరం లేదని చేసిన కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో కవిత నేడు ఆయనకు కౌంటర్ ఇచ్చారు.

 

మరిన్ని కథనాలు:

MLC Kavitha: కవిత ఇంటి వద్ద భారీ బందోబస్తు.. ఎందుకంటే?

 

Share This Post