భారత్ సమాచార్.నెట్, రంగారెడ్డి: తుర్కయంజాల్ మున్సిపాలిటీ కమిటీ ఉపాధ్యక్షులు లపంగి రాజు అధ్యక్షతన ఇంజాపూర్ గ్రామంలో ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా మున్సిపాలిటీ అధ్యక్షులు పట్నం రమేష్ కురుమ పాల్గొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ అగ్రవర్ణాలలో ఉన్న పేదలను కలుపుకొని బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యవర్ కాన్షీరాం కలలు పేద వర్గాలకు రాజ్యాధికారాన్ని సాధించేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. అనంతరం నూతన కమిటీల నియామకంలో భాగంగా మున్సిపాలిటీ జనరల్ సెక్రటరీగా మల్లెల రఘు, కోశాధికారిగా చెక్క రంజిత్ కుమార్‌ను, కార్యదర్శిగా నెమలి సత్యనారాయణని నియమించి నియామక పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ సీనియర్ నాయకులు మేతరి కుమార్, యడవల్లి శ్యామ్, మల్లెల నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
‘రాజ్యాధికారానికి ప్రతీఒక్కరూ కృషి చేయాలి’
RELATED ARTICLES