భారత్ సమాచార్.నెట్, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 4అంతస్థుల భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఇప్పటికే కొంతమందిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది.. మిగితావారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈశాన్య ఢిల్లీ సీలంపూర్‌లోని జనతా కాలనీలోశనివారం ఉదయం భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. గమనించిన స్థానికులు హుటాహుటిన శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
ఒక్కసారిగా కుప్పకూలింది:
ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న 14 నెలల బాలుడితో పాటు నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలను బయటకు తీశారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ భవనంలో 10మంది గల ఫ్యామిలీ ఉంటున్నట్లు సమాచారం. ప్రమదానికి సంబంధించి స్థానికులు కీలక విషయాలు తెలిపారు. ఉదయం 7 గంటల సమయంలో నేను మా ఇంట్లో ఉండగా ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో దుమ్ము వ్యాపించింది. కిందికు దిగి చూసేసరికి మా పక్కనున్న ఇల్లు కుప్పకూలిపోయింది. ఆ బిల్డింగ్‌లో 10మంది ఉంటారు. ఎంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారో తెలియదని అస్మా అనే స్థానికురాలు తెలిపింది.