August 5, 2025 12:00 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

Butter Milk: వేసవిలో మజ్జిగ చేసే మేలు గురించి తెలుసా 

భారత్ సమాచార్.నెట్: వేసవి కాలం(Summer Season) వచ్చిందంటే చాలు.. శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. డీహైడ్రేషన్ (Dehydration)కు, అలసటకు గురవుతారు. ఎండల తీవ్రత రోజు రోజుకీ పెరుగుతున్న ఈ కాలంలో శరీరాన్ని హైడ్రేట్‌గా (Hydrate) ఉంచుకోవడం ఎంతో అవసరం. తక్షణ శక్తి కోసం చాలా మంది శీతలపానీయాల (Soft Drinks) వైపు దృష్టి సారిస్తారు. అయితే కూల్ డ్రింక్స్ కంటే.. సహజ పానీయాలు కొబ్బరి నీరు, మజ్జిగ, బార్లీ, చెరకు రసం, నారింజ జ్యూస్, నిమ్మరసం, పండ్లు, నీళ్లతో పాటు మజ్జిగా వంటివి దాహార్తిని తీర్చడమే కాదు.. తక్షణ శక్తిని కూడా ఇస్తాయి.
హైడ్రేషన్ (Hydration) కోసం రోజుకు కనీసం రెండు సార్లు మజ్జిగను (Butter Milk) ఆహారంలో చేర్చుకోవాలి. వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మజ్జిగ ఎంతో మేలు చేస్తుంది. పెరుగుతో తయారయ్యే మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతి రోజు ఒక్క గ్లాస్ మజ్జిగ తాగడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో మజ్జిగ, పెరుగు కంటే మెరుగైనదిగా భావిస్తారు. పెరుగులో చురుకైన బ్యాక్టీరియా ఉండటం వల్ల.. వేడి వాతావరణంలో అది పొట్టలో చేరి పులియడం ప్రారంభిస్తుంది. ఇది శరీరాన్ని చల్లబరచడానికి బదులుగా వేడిని పెంచే అవకాశం ఉంటుంది.
అందుకే పెరుగు బదులుగా వేసవిలో మజ్జిగ మంచిది. ఇది నీటితో కలిపి తయారు చేస్తారు. మజ్జిగలో జీలకర్ర పొడి, కొత్తిమీర, పుదీనా, పింక్ సాల్ట్ వంటి పదార్థాలు కలిపితే అది జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇంగువను కలిపి తాగడమూ కొన్ని మందికి ప్రయోజనం ఇస్తుంది. ఆయుర్వేదం ప్రకారం, మజ్జిగ చల్లదనం కలిగించే గుణాలను కలిగి ఉంటుంది. వేసవిలో శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఇది సాయపడుతుంది. కాబట్టి వేసవి కాలంలో ప్రతిరోజూ ఒకటి రెండు గ్లాసుల మజ్జిగను తీసుకునే అలవాటు పెంచుకోండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Share This Post