August 7, 2025 2:17 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

మజ్జిగతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: మజ్జిగ మన ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మజ్జిగలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి2, విటమిన్ బి12 అలాగే పొటాషియం, భాస్వరం, అయోడిన్, జింక్, ప్రోబయోటిక్స్ ఉండడంతో ప్రోబయోటిక్స్ పేగులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయం చేస్తుంది. మజ్జిగ తీసుకోవడం వల్ల ఎముకలు బలపడడమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కేవలం ఎండాకాలంలో ఈ మజ్జిగ తాగితే.. మనకు వేడి చేయకుండా ఉంటుందని, శరీరాన్ని చల్లగా మార్చడానికి సహాయపడుతుందని నమ్ముతారు. అయితే, రాత్రిపూట నిద్రకు ముందు మజ్జిగా తాగితే శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. బరువు తగ్గడానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు పేర్కొన్నారు.

మజ్జిగతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు:

మజ్జిగ తాగిన తర్వాత ఎక్కువ సేపు కడుపు నిండినట్లు అనిపించడంతో ఆకలి వేయదు. అలాగే, మజ్జిగలో ప్రోటీన్ ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీంతో తొందరగా ఆకలి వేయకుండా ఉంటుంది. బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. రాత్రిపూట జీలకర్ర , నల్ల మిరియాలతో కలిపిన మజ్జిగను తీసుకుంటే, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి అవసరమైన జీవక్రియ కూడా బాగానే ఉంటుంది. బరువు తగ్గాలనే ప్రయత్నంలో ఉన్నావారు పగటిపూట కాకుండా రాత్రిపూట మజ్జిగ తాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Share This Post