భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్: జిల్లా ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ ఆదేశాల మేరకు శనివారం ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మత్తు పదార్థాలను నిర్మూలించడమే తమ లక్ష్యమని తొర్రూర్ డీఎస్పీ కృష్ణ కిశోర్ అన్నారు. ఈ తనిఖీల్లో 4 క్వింటాళ్ల బెల్లం, 4 వేల లీటర్ల సారా, 20 లీటర్ల లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు సరైన ధ్రువపత్రాలు లేని 22 బైకులు, ఒక ఆటోను కూడా పోలీసులు సీజ్ చేశారు. గుడుంబా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో నెల్లికుదురు ఎస్సె రమేశ్ బాబు, దంతాలపల్లి ఎస్సై రాజు, పెద్దవంగర క్రాంతి కిరణ్, నర్సింహులపేట ఎస్సై సురేశ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని కథనాలు
రైల్వే స్టేషన్‌లో రైలు బోగి దగ్ధం.. త్రుటిలో తప్పిన పెనుప్రమాదం