భారత్ సమాచార్.నెట్: ప్రముఖ హీరో (Actor) విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) వివాదంలో చిక్కుకున్నారు. గిరిజన ప్రజల (Tribals) గురించి తప్పుగా మాట్లాడారంటూ ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కిషన్ రాజ్ చౌహాన్ (Kishan Raj Chauhan) ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అసలు ఏం జరిగిందంటే.. సూర్య హీరోగా తెరకెక్కిన రెట్రో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్టుగా వెళ్లిన విజయ్ అక్కడ వేదికపై మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదుల గురించి మాట్లాడబోయి గిరిజనులు అంటూ కీలక కామెంట్స్ చేశాడు. 500 ఏళ్ల క్రితం గిరిజన వర్గాల మధ్య జరిగిన ఘర్షణలను తలపించేలా పహల్గామ్ ఉగ్రదాడి ఉందని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై గిరిజన సంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విజయ్ వ్యాఖ్యలు తమను కించపరిచేలా ఉన్నాయని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రెట్రో ప్రీరిలీజ్ ఈవెంట్‌లో విజయ్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కశ్మీర్ భారత్ దే.. కశ్మీరీలు మనవాళ్లే అని అన్నారు. రెండేళ్ల క్రితం ఖుషీ మూవీ షూటింగ్ అక్కడే జరిపామని అక్కడ చాలామంచి జ్ఞాపకాలున్నాయిని గుర్తు చేసుకున్నారు. పాకిస్థాన్ తన ప్రజల కనీస అవసరాలను అందించేందుకు కష్టపడుతోందన్నారు. భారత్ పాక్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదని.. అక్కడి ప్రజలకే విరక్తి వచ్చి పాక్ ప్రభుత్వంపై తిరగబడతారని అన్నారు. 500 ఏళ్ల క్రితం గిరిజనులు కొట్టుకున్నట్లు.. ఉగ్రవాదులు.. కామన్ సెన్స్ లేకుండా ఇలాంటి పనులు చేస్తున్నారని అన్నారు. వర్గాల మధ్య జరిగిన ఘర్షణలను