భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ; 2024 లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించే పలు ఎంట్రన్స్ పరీక్షల తేదీలు మార్పు చేసినట్టు విద్యాశాఖ అధికారులు నేడు అధికారికంగా వెల్లడించారు. వాస్తవానికి 2024 పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలక ముందే తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ పలు ఎంట్రన్స్ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. విద్యార్థులు అందుకు అనుగుణంగా ప్రిపరేషన్ ను కూడా కొనసాగిస్తున్నారు. కానీ తెలంగాణ విద్యాశాఖ అధికారులు ఎలక్షన్ కమిషన్ సూచనలనుగుణంగా తమ పరీక్షల తేదీలను మార్చుకోవాల్సి వచ్చింది. మొదట వెల్లడించిన తేదీల్లో కాకుండా మే 7,8 తేదీల్లో (EAPCET) engineering agriculture and medical common entrane test అగ్రి అండ్ ఫార్మా పరీక్షను నిర్వహించనున్నారు. మే 9,10,11 తేదీల్లో EAPCET ఇంజినీరింగ్ పరీక్ష ను జరపనున్నారు. తెలంగాణ ICET ఎంట్రన్స్ ఎగ్జామ్ ను జూన్ 5,6 తేదీలకు మార్పు చేశారు. విద్యార్థులు మారిన పరీక్షల తేదీలకు అనుగుణంగా ప్రిపరేషన్ ను కొనసాగించాలని, సరైన డేట్ లో పరీక్షకు హాజరుకావాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.
ఎంట్రన్స్ పరీక్షల తేదీల మార్పు
RELATED ARTICLES