భారత్ సమాచార్, విద్య ;
ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ సిలబస్ లో మార్పుల దిశగా శరవేగంగా కసరత్తు జరుగుతోంది. కొంత కాలంగా సిలబస్ మార్పు..పరీక్షా విధానం పైన విద్యా శాఖలో చర్చ జరుగుతోంది. ఇంటర్ విద్యా విధానంలో సంస్కరణలకు బోర్డు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా కీలక నిర్ణయాల అమలుకు సిద్దమవుతోంది. ఇప్పటివరకు స్టేట్ సిలబస్ పుస్తకాలు అ ల్లో ఉండగా వాటి స్థానంలో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ ను ప్రవేశపెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది.
సిలబస్ లో మార్పు….
ఇంటర్ విద్యాశాఖ కీలక మార్పులకు సిద్దమైంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి మొత్తం పాఠ్యాంశాలను(సిలబస్) మార్చేయాలని నిర్ణయించింది. ఇప్పటివరకు స్టేట్ సిలబస్ పుస్తకాలు అమ ల్లో ఉండగా వాటి స్థానంలో ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. సిలబస్ ను ఎన్‌సీఈఆర్‌టీలోకి మార్చినా పరీక్షల విధానం యథాతథంగానే కొనసాగించనుంది. ఎన్‌సీఈఆర్‌టీలో గణితం ఒక్కటే సబ్జెక్టుగా ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఇంటర్‌లో గణితం 2 సబ్జెక్టులుగా ఉంటుంది. దీనికోసం ఎన్‌సీఈఆర్‌టీ గణిత సిలబస్ ను రెండుగా విభజించి 1 ఏ, 1 బీ, 2 ఏ, 2 బీ లుగా అమలు చేయనుంది.
ట్రాకింగ్ విధానం….
జేఈఈ, సీయూఈటీ, క్లాట్ లాంటి పరీక్షల్లో వచ్చే ప్రశ్నలు ఎక్కువగా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్ ఆధారంగానే వస్తున్నాయని గుర్తించిన ప్రభుత్వం ఈ మేరకు మార్పులు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులను మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
లెక్చరర్లకు శిక్షణ….
విద్యార్థులకు తరచూ పరీక్షలు నిర్వహించడం, వారు ఏ స్థాయిల్లో ఉన్నారో గుర్తించి దానికి అనుగుణంగా రెమిడియల్ తరగతులు నిర్వహించడం లాంటి బోధనా విధానం ఉంది. ఇలాంటి విధానాన్నే ప్రభుత్వ కాలేజీల్లోనూ ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచి మారనున్న సిలబస్ కు అనుగుణంగా జూనియర్ లెక్చరర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. మారిన సిలబస్, కొత్త బోధనా విధానంపై వీరికి శిక్షణ ఇవ్వనున్నారు.