July 28, 2025 11:48 am

Email : bharathsamachar123@gmail.com

BS

డొక్కా సీతమ్మ భోజన పథకంలో మార్పులు

భారత్ సమాచార్, అమరావతి ;

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు డొక్కా సీతమ్మ భోజన పథకం పేరుతో మధ్యాహన్నం భోజనం పెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో అందించే మెను మారుస్తున్నట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మారిన మెనుతో భోజనాన్ని దీపావళి నుంచి విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇందుకు విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి అభిప్రాయ సేకరణ చేపడుతోంది.ఉడికించిన గుడ్డు స్థానంలో రుచిగా ఉండేందుకు ఎగ్‌ కర్రీ, ఫ్రై వంటి వాటిని మెనులో ప్రభుత్వం చేర్చనుంది. విద్యార్థులకు రుచితో పాటు శుచిగా ఎండీఎంను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రొటీన్లు, పిండిపదార్థాలు సమానంగా అందించే విధంగా మోనూ రూపకల్పనకు కసరత్తు చేస్తుంది.

కొత్త మెనూపై ఇలా కసరత్తులు జరుగుతున్నాయి…

– సాంబార్‌ బాత్‌ను రెండూ కలిసి కాకుండా వేర్వేరుగా వడ్డించాలి.

– వారంలో ఐదు రోజులు ఇస్తున్న గుడ్డును.. మూడు రోజులు వేపుడు, కూర రూపంలో ఇవ్వాలి.

– రాగి జావలో సుగంధ ద్రవ్యాలు కలపాలి. పచ్చళ్లలో గోంగూర లేదా బీర/ వంకాయిలను కూడా చేర్చాలి.

– వారంలో అన్ని రోజులూ రాగిజావ ఇవ్వకుండా కేక్‌, లడ్డూలను డ్రైపూట్స్‌తో కలిపి ఇవ్వాలి.

– సన్నబియ్యం సరఫరా చేయాలి. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాల పిల్లలకు వంద గ్రాములు, పై తరగతతులకు 150 గ్రాముల బియ్యం కేటాయిస్తున్నారు. వీటి పరిమాణం పెంచాలి. గ్యాస్‌ను రాయితీ ధరకు అందించాలి.

– నిత్యావసరాల ధరల పెరుగుదలకు అనుగుణంగా మార్పు చేయాలి.

– భోజన పదార్ధాలను తయారీకి అల్యూమినయం పాత్రలు సమకూర్చాలి. వంట గదులు నిర్మించాలి. వారానికి ఒక రోజు మోనూలో పండు, మజ్జిగ కూడా చేర్చాలి.

మరికొన్ని వార్తా విశేషాలు...

టీడీపీ లిక్కర్ మాఫియా నడిపిస్తోంది…జగన్

Share This Post
error: Content is protected !!