భారత్ సమాచార్.నెట్: జమ్మూకశ్మీర్ (Jammu & Kashmir) పహల్గామ్ పర్యాటకులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడి 28 మందిని పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉగ్రదాడితో (Terror attack) చార్‌ధామ్ (Chardham) భక్తులు (Devotees) భయాందోళనకు గురువతున్నారు. మరో మూడు రోజుల్లో ప్రారంభంకానున్న చార్‌ధామ్ యాత్రకు వెళ్లాలని అనుకున్న భక్తులు.. ఉగ్రదాడి భయంతో వెనక్కి తగ్గుతున్నారు. ఈ నేపథ్యంలోనే చార్‌ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర కోసం ఇప్పటివరకు 19.95 లక్షల మందికిపైగా భక్తులు వారి పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో సుమారు 17 వేల మంది విదేశీ యాత్రికులు ఉన్నారు. పేర్లు నమోదు చేసుకున్న విదేశీయుల్లో ఎక్కువగా అమెరికా, బ్రిటన్, మలేసియా, నేపాల్, ఆస్ట్రేలియాతో పాటు 103 దేశాల పౌరులు ఉన్నారు. విదేశీ భక్తుల ప్రయాణం, దర్శనం సజావుగా, సురక్షితంగా సాగేలా ఏర్పాట్లను చేస్తోంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం.
ఇకపోతే పర్యటక శాఖ నుంచి అందిన వివరాల ప్రకారం.. కేదార్‌నాథ్‌కు 6100, బద్రీనాథ్‌కు 4800, గంగోత్రి 3150, యమునోత్రికి 2750 మంది విదేశీ యాత్రికులు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఓవర్ ఆల్‌గా చార్‌ధామ్ యాత్ర కోసం 19,95,929 మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో కేదార్‌నాథ్ ధామ్‌కు 6,81,81, బద్రీనాథ్‌కు 6,01,278, గంగోత్రి ధామ్‌కు 3,54,649, యమునోత్రికి 3,23,551, హేమకుండ్ సాహిబ్‌కు 34,633 మంది భక్తులు నమోదు చేసుకున్నారు.