July 29, 2025 4:53 pm

Email : bharathsamachar123@gmail.com

Breaking

ChatGPT: ప్రపంచవ్యాప్తంగా చాట్‌జీపీటీ సేవలకు అంతరాయం  

భారత్ సమాచార్.నెట్: ఓపెన్‌ ఏఐ (Open AI) సంస్థకు చెందిన చాట్‌జీపీటీ (ChatGPT) సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో యూజర్లు (Users) తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చాట్‌జీపీటీపై ఆధారపడి చాలా మంది పని చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కంటెంట్, ఫొటోలు, వీడియోలు, కోడింగ్ ఇలా చాలా పనులకు చాట్‌జీపీటీని ఉపయోగిస్తున్నారు యూజర్లు. ఇటీవల కాలంలో చాట్‌జీపీటీ సర్వర్ డౌన్ ఇష్యూస్ వల్ల ఈ సేవలకు అంతరాయం కలుగుతోంది. ఈ ఏడాది చాట్‌జీపీటీ సేవలు ఇలా నిలిచిపోవడం ఇది రెండోసారి.
‘డౌన్‌డిటెక్టర్‌’ అనే వెబ్‌సైట్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం.. చాట్‌జీపీటీకి ప్రశ్నలు పంపినప్పటికీ, అవి స్వీకరించడం లేదు. కొన్ని సందర్భాల్లో ప్రశ్నలు స్వీకరించినా.. సమాధానాలు ఆలస్యంగా అందుతున్నట్లు పేర్కొంది. ఇవాళ మ‌ధ్యాహ్నం 2.45 నుండి ఇండియాలో చాట్‌జీపీటీ సేవ‌ల‌కు అంత‌రాయం క‌లిగింద‌ని వంద‌ల సంఖ్యలో యూజ‌ర్లు ఫిర్యాదు చేశారు. దేశంలో 82శాతం మంది వెబ్‌సైట్ ద్వారా చాట్‌జీపీటీ వినియోగించే వాళ్లు ఫిర్యాదు చేయ‌గా.. 14శాతం మంది మొబైల్ అప్లికేష‌న్ ఉప‌యోగించే యూజ‌ర్లు ఫిర్యాదు చేశారు.
ఇకపోతే ఈ అంతరాయంపై చాట్‌జీపీటీ సంస్థ స్పందించింది. చాట్‌జీపీటీ అలాగే దాని టెక్స్ట్-టు-వీడియో ప్లాట్‌ఫామ్ సోరా(Sora ) రెండు ప్రభావితమయ్యానని ధృవీకరించింది. దీని వల్ల కొంతమంది వినియోగదారులకు చాట్‌జీపీటీ సేవల్లో ఎర్రర్స్ వస్తున్నాయని, మరికొంతమందికి సమాధానాలు ఆలస్యమవుతున్నాయని వివరించింది. త్వరలోనే ఈ సమస్యను గుర్తించి పరిష్కరించడానికి తాము ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.
Share This Post