భారత్ సమాచార్.నెట్, డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా ఉత్తరకాశీ జిల్లాలోని ఖీర్ గంగా నది విజృంభించడంతో క్లౌడ్ బరస్ట్ ఏర్పడింది. దీంతో గంగోత్రీలోని ధరాలి గ్రామాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఆకస్మిక వరదల కారణంగా ఖీర్ గంగా నది పరివాహక ప్రాంతాల ఉన్న ఇళ్లు కొట్టుకుపోయాయి. ఈ ప్రకృతి విపత్తులో అనేక మంది మరణించగా.. చాలా మంది గల్లంతు అయినట్లు సమాచారం.
ఊహించని ప్రమాదం సంభవించి ధరాలి గ్రామాన్ని ముంచెత్తడంతో వందలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయి. అనేక మంది ప్రజలు ఆ ఇళ్లశిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. గల్లంతు అయిన వారి కోసం గాలిస్తు్న్నాయి. మరోవైపు నది పరివాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు.
ఇక ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి సోషల్ మీడియా వేదికగా విచారం వ్యక్తం చేశారు. ధరాలి గ్రామంలో సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని.. నిరంతరం తాను అధికారులతో సంపద్రింపులు చేస్తూ.. పరిస్థితిని సమీక్షిస్తున్నానని తెలిపారు. మరో ఐదు రోజుల వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
To Watch Video Click the Link Below:
https://x.com/i/status/1952653045629698460