భారత్ సమాచార్.నెట్, తిరుమల: తిరుపతి పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కపిలేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కపిలేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు చంద్రబాబు. అనంతరం చంద్రబాబును పవిత్రం పట్టు వస్త్రం కప్పి.. వేదాశీర్వచనం అందించారు వేద పండితులు. అంతకుముందు ఆలాయనికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు.
అయితే చంబ్రాబు తిరుపతి పర్యటనలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు స్వయంగా పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తారు. ఆలయ పరిసరాలను స్వయంగా శుభ్రపరిచారు చంద్రబాబు. ఆలయ పరిసరాలను చీపురుతో ఊడ్చి, శుభ్రంగా తుడిచారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో ఆప్యాయంగా పలకరించి.. వారితో ముచ్చటించి.. వారితో గ్రూప్ ఫొటో దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సీఎం కార్యాలయం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఇక స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీపై విమర్శలు గుప్పించారు. నేర చరిత్ర ఉన్న నాయకులను చెత్త ఊడ్చినట్లు ఊడ్చేయ్యాలని వ్యాఖ్యానించారు. రాజకీయాలు కలుషితమయ్యాయని పేర్కొన్న చంద్రబాబు.. నేరస్తుల గుండెల్లో నిద్రపోతానని హెచ్చరించారు. ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు స్వచ్ఛాంధ్రప్రదేశ్ అవసరమన్నారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని.. లేదంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధం అమలు చేయనున్నట్లు చెప్పారు.
Share This Post