భారత్ సమాచార్.నెట్, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు చంద్రబాబు. అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు అదే రోజు మధ్యాహ్నం కేంద్ర హఓం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రేపు, ఎల్లుండి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా ఇతర కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చించనున్నట్లు సమాచారం.
అలాగే మాజీ ప్రధాని పీవీ సంస్మరణ సభ, సీఐఐ బిజినెస్ మీట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, సీఆర్ పాటిల్, మన్సుఖ్ మాండవీయ తదితరులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటికి అవసరమైన నిధులు, పోలవరం- బనకచర్ల అనుసంధాన ప్రాజెక్ట్ సహా వేర్వేరు అంశాలపై చంద్రబాబు కేంద్రమంత్రులతో చర్చించనున్నారు.
రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు అభివృద్ది పనులు వేగవంతంగా జరిగేందుకు.. కేంద్రం నుండి మరింత సమన్వయం, సహాయాన్ని చంద్రబాబు కోరనున్నట్లు సమాచారం. అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన పనుల గురించి కూడా ఆయా మంత్రిత్వ శాఖతో సీఎం చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. చేయనున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని 17వ తేదీ ఉదయం 9.30 నిమిషాలకు ఢిల్లీ నుంచి అమరావతి రానున్న చంద్రబాబు.
Share This Post