Homemain slidesసామాన్యులే దేవుళ్లు..ఇప్పుడదే నేతల స్లోగన్

సామాన్యులే దేవుళ్లు..ఇప్పుడదే నేతల స్లోగన్

భారత్ సమాచార్, రాజకీయం : బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం.. వారి అహంకారం అని తెలంగాణలో ఏ పోరగాన్ని అడిగినా చెబుతాడు. వారి ప్రవర్తన మార్చుకుంటే నేడు ప్రతిపక్షంలోకి వచ్చిఉండేవారే కాదు. 10ఏండ్లుగా నిరుద్యోగులను చిన్న చూపు చూస్తూ.. వారి ఓట్లు తమకేం అవసరం లేదన్నట్టుగా కేసీఆర్, కేటీఆర్ ప్రవర్తించారు. చివరకు ఉద్యోగ పరీక్షల లీకేజీలు, రద్దు, వాయిదాలతో నిరుద్యోగులు నైరాశ్యంలో ఉంటే పాలకులుగా కనీసం భరోసా కల్పించలేకపోయారు. ఇక మ్యానిఫెస్టోలోనైతే నిరుద్యోగులు అనే పదమే లేకుండా చేశారు. దీంతో నిరుద్యోగులు తమకు ఉద్యోగం ఇవ్వని కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టాలని కంకణం కట్టుకున్నారు. ఊరూరూ తిరిగారు.. చివరకు కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టారు. అహంకారమే వారిని పదవీచిత్యులను చేసిందనడానికి నిరుద్యోగుల ఉదంతమే కారణం.

వారి అహంకారానికి ఇంకా ఎన్నెన్నో కారణాలు చూపించవచ్చు. సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లరు..తన దగ్గరకు రానివ్వరు.. కనీసం మంత్రులకు కూడా అపాయింట్ మెంట్ ఇవ్వరు. సామాన్యుడు ప్రగతి భవన్ లోకి అడుగుపెట్టలేడు. ఇవన్నీ పోరాట స్వభావమున్న తెలంగాణ ప్రజలకు రుచించలేదు. అహంకారపూరితంగా వ్యవహరిస్తే ఎవరినైనా గద్దె దించుతామని నిరూపించారు.

ఇవన్నీ బాగా పరిశీలించిన రేవంత్ రెడ్డి..తెలంగాణ ప్రజలతో అహంకార పూరితంగా ఉంటే నడువదు..అని దాదాపు ఫిక్స్ అయ్యారు. అందుకే సీఎం ప్రోటోకాల్ పక్కన పెట్టేశారు. ప్రగతి భవన్ ను ప్రజాభవన్ చేశారు. సామాన్యులను కలుస్తున్నారు. మంత్రులు తమను ‘‘అన్నా, అక్కా’’ అని అనమంటున్నారు. ఇలా కాంగ్రెస్ నేతలు తమకు అహంకారం లేదు.. మేము ప్రజల మనుషులం అని చెప్పే తీరుగా ప్రవర్తిస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమిని విశ్లేషించుకున్న కేసీఆర్, కేటీఆర్ లకు విషయం బోధపడినట్టుంది. తాజాగా వారు కూడా సామాన్యుల జపం చేస్తున్నారు. కొత్త సంవత్సరం తొలి రోజున కేటీఆర్.. బీఆర్ఎస్ కార్యాలయంలోకి పారిశుధ్య కార్మికులను ఆహ్వానించి వారితో కలిసి భోజనం చేశారు. వారితో సెల్ఫీ లు దిగారు. ఇక కేసీఆర్ కూడా తన దగ్గరకు వచ్చిన జనాలతో మాట్లాడుతున్నారు.

ఇదిలా ఉంటే ప్రధాని మోదీ సైతం పారిశుధ్య కార్మికుల దగ్గరికి వెళ్లి మాట్లాడడం, మొన్నటికి మొన్న అయోధ్యలో ఓ పేద ఇంట్లో చాయ్ తాగడం, రాహుల్ గాంధీ కూడా గుడిసె జనాల ఇండ్లకు వెళ్లడం.. ఇలా ఒకరేమిటి అందరూ నేతలు తమ స్ట్రాటజీని మార్చుకున్నారు. వెనకటిలా ఆర్డర్లు వేస్తే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. వారిలో కలిసిపోతేనే ఓట్లు వేస్తారని నాయకులకు అర్థమయ్యే ఉంటుంది.

మరికొన్ని కథనాలు…

నిన్న జయంతి వైభవం.. నేడు విగ్రహం ధ్వంసం

RELATED ARTICLES

Most Popular

Recent Comments