Homebreaking updates newsరూ.10 కాయిన్ చెల్లదంటే ఫిర్యాదు చేయచ్చు

రూ.10 కాయిన్ చెల్లదంటే ఫిర్యాదు చేయచ్చు

భారత్ సమాచార్, ముంబయి ;

ఇప్పటికీ చాలా వ్యాపార సముదాయాల్లో, బస్సులు, రైల్వేలు, స్థానిక వాణిజ్య ప్రాంతాల్లో రూ.10, 20 రూపాయల కాయిన్ చెల్లు బాటు కావటం లేదని చాలా మంది వాటిని తీసుకోటానికి తిరస్కరిస్తున్నారు.ఇప్పటికే చాలా సార్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ కాయిన్స్ చెల్లుబాటు లో ఉన్నాయని చాలా సార్లు అధికారికంగా ప్రకటించింది. వాటి సంబంధించి ప్రకటనలు కూడా జారీ చేసింది. అయినప్పటికీ పౌరులు, వ్యాపారులు వాటిని తిరస్కరిస్తూనే ఉన్నారు.

దీంతో రూ.10,20 రూపాయల కాయిన్ లు చెల్లుబాటు చేయటానికి ఆర్బీఐ తాజాగా కఠిన చర్యలు చేపట్టింది. ప్రభుత్వం గుర్తించిన ఈ నాణేలను తిరస్కరిస్తే చట్ట ప్రకారం నేరం అవుతుందని ఆర్బీఐ తాజాగా అధికారికంగా హెచ్చరిక కూడా జారీ చేసింది. భారత ప్రభుత్వం ఆమోదించిన ఈ 10 మరియు 20 రూపాయల నాణేలు ధృవీకరించబడిన కరెన్సీలు మరియు వాటిని తిరస్కరించే హక్కు ఎవరికీ లేదు. ఎవరైనా ఇలాంటి పని చేస్తే, మీరు వారిపై IPC సెక్షన్ 124A కింద ఫిర్యాదు చేయవచ్చు. ఈ కేసులో జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉన్నట్లు ఆర్బీఐ అధికారులు తాజాగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఆర్బీఐ అధికారిక వెబ్సైట్ ను చూడాలని అధికారులు పౌరులకు సూచించారు.

మరికొన్ని ప్రత్యేక విశేషాలు…

మనం కడుతున్న ట్యాక్సులకు విలువ లేదా.. మన బతుకులు మారవా..?

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments