July 28, 2025 5:37 pm

Email : bharathsamachar123@gmail.com

BS

కాంగ్రెస్ పాలన @100డేస్

భారత్ సమాచార్, రాజకీయం ; తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయిపోయింది. దీని కేంద్రంగా ప్రతి పక్షం అధికార ప్రభుత్వంపై నెట్టింట భారీ స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది.

‘‘ఎన్నికలప్పుడు అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక లంకెబిందెలు, లాగులు, తొండలు, పేగులు అనుకుంటూ ఉన్న సవ్యంగా పని చేస్తున్న వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నారు. ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టి ప్రజలకు పంగనామం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం’’ అంటూ బీఆర్ఎస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చింది.

మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 100 రోజుల పాలనలో, 174 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు చేసుకున్నారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరిష్ రావు ట్వీట్టర్ వేదికగా నేడు ఆరోపించారు.

అయితే చెప్పిన హామీలు అన్నీ కూాడా అమలు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నెట్టింట ప్రకటనలు చేసింది. ప్రతి ఒక్క గ్యారంటీని చిత్తశుద్దితో అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది.

మరికొన్ని రాజకీయ కథనాలు…

ప్రశ్నిస్తే ఫోన్ సీజ్ చేస్తారా?

Share This Post
error: Content is protected !!