భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;
శనివారం కావటంతో కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడు కొండల శ్రీనివాసుడు దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. 28-06-2024వ తేదీన స్వామివారిని 66,256 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తితో స్వామి వారికి భక్తితో 30,087 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న ఒక్క రోజే రికార్డు స్థాయిలో శ్రీవారికి భక్తులు రూ3.54 కోట్లు కానుకలు హుండీ ద్వారా సమర్పించారు. వడ్డీ కాసుల వాడి సర్వ దర్శనానికి ప్రస్తుతం 31 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచితంగా శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 16 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి 12 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారుగా 5 గంటల సమయం పడుతోంది. రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారుల అంచనా.