July 28, 2025 8:12 am

Email : bharathsamachar123@gmail.com

BS

bhadrachalam: భద్రాచలం రాములోరి ఫొటోలకు అధికారిక కాపీరైట్స్

భారత్ సమాచార్.నెట్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రస్వామి (Sree Seetha Ramachandraswamy) ఆలయం తెలుగు రాష్ట్రాల్లోని (Telugu States) ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో (Temples) ఒక్కటి. సీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు (Devotees) తరలివస్తుంటారు. భక్తుల సందర్శనతో ఆలయ పరిసర ప్రాంతాల్లో శ్రీరామ నామస్మరణతో మారుమోగుతోంది. అయితే భద్రాచలం సీతారామచంద్రస్వామి మూలవరుల చిత్రాలు, ఫొటోలు దుర్వినియోగమవుతున్న నేపథ్యంలో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
భద్రాచలం సీతారామచంద్రస్వామి మూలవరుల ఫొటోలు దుర్వినియోగం కాకుండా దేవస్థానం అధికారికంగా కాపీ రైట్స్ హక్కులను పొందింది. ఈ విషయాన్ని దేవస్థాన ఈవో రమాదేవి వెల్లడించారు. ఆలయ కీర్తి, ప్రతిష్టలకు హానికరంగా ఉపయోగించే ఫొటోలు, చిత్రాలు దేశవాళ్లు ఎక్కడైన కూడా చట్టవిరుద్ధంగా వినియోగం కాకుండా చూడటానికి ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు.
చట్టాన్ని ఉల్లంఘించి, భద్రాచలం ఆలయ చిత్రాలను అనధికారంగా ఉపయోగించే ముద్రణదారులు, వ్యాపారులు, సహకారులపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రామ్ అండ్ రామ్ ట్రేడ్ మార్క్, పేటెంట్, డిజైన్ కాపీరైట్ రిజిస్ట్రేషన్ కన్సల్టెంట్స్ స్పష్టం చేశారు. తమ ఆధీనంలో ఉన్న చిత్రాలు, ఫొటోలను సదరు ముద్రణ సంస్థల నిర్వాహకులు, వ్యాపారులు జూన్ 20 తరువాత విక్రయిస్తే చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా.. జైలు శిక్ష తప్పదని స్సష్టం చేశారు.
Share This Post
error: Content is protected !!