భారత్ సమాచార్.నెట్, బాపట్ల: జిల్లాలో డెంగీ కలకలం రేగింది. నగరం మండలం ఈదుపల్లి గ్రామంలో డెంగీ అనుమానిత లక్షణాలతో సోమవారం తుమ్మల సుబ్బారావు, మహాలక్ష్మి దంపతులు మృతి చెందారు. అంతేకాకుండా అదే గ్రామానికి చెందిన పలువురు జ్వరంతో ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. దంపతులిద్దరూ వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. వారిని గుంటూరు ఆసుపత్రికి తరలించే లోపే సుబ్బారావు మృతి చెందగా గంట వ్యవధిలోనే ఆయన భార్య మహాలక్ష్మి కూడా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. డెంగీ జ్వరాల వ్యాప్తి దృష్ట్యా, కట్టడి చర్యలపై అధికారులు అప్రమత్తమై చర్యలు ప్రారంభించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని కథనాలు