HomeUncategorizedపీజీ ప్రవేశాలకు సీపీగెట్‌ నోటిఫికేషన్ విడుదల

పీజీ ప్రవేశాలకు సీపీగెట్‌ నోటిఫికేషన్ విడుదల

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా: తెలంగాణలో పీజీ ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. కామన్‌ పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌) నోటిఫికేషన్‌ మే 15న విడుదలైంది. తెలంగాణలో పీజీ కాలేజీల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్‌ పీజీ ప్రవేశ పరీక్ష (సీపీగెట్‌)ను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ఉస్మానియా వర్శిటీ నిర్వహించనుంది. జూన్ మూడో వారం లేదా చివరి వారంలో ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2022-23 నుంచి కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో భారీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఏదేనా డిగ్రీ పాసైన విద్యార్థులు.. ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్ కోర్సుల్లో పీజీ అడ్మిషన్లు పొందేందుకు అవకాశం కల్పించేలా నిర్ణయించారు. ఈ మార్పు గతేడాది నుంచే అమలులోకి వచ్చింది. విద్యార్థులు ఏ విభాగంలో డిగ్రీలో పాస్ అయినా.. ఆర్ట్స్, పొలిటికల్ సైన్స్ కోర్సుల్లో పీజీలో అడ్మిషన్ పొందేలా అవకాశం కల్పించారు. ఈ ఏడాది కూడా ఇదే విధానం ఉండే అవకాశం ఉంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పరీక్షల నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా వర్శిటీకి అప్పగించారు. ధరఖాస్తు విధానం, ఫీజు చెల్లింపు గడువు, చివరి తేదీ, పరీక్ష తేదీ తదితర వివరాల కోసం https://www.osmania.ac.in/oldsite/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

మరింత ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి

ఆర్డీటీ సెట్-2024కు దరఖాస్తుల ఆహ్వానం

RELATED ARTICLES

Most Popular

Recent Comments