భారత్ సమాచార్, సినీ టాక్స్ : పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ ‘దేవర’ మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోనే భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో వస్తున్న సినిమాల్లో దేవర కూడా ఒకటి. త్రిపుల్ ఆర్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు. దేశంలో సౌత్ నుంచే కాక ఉత్తరాది నుంచి కూడా ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ భారీగానే ఉన్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో ‘వార్ -2’ కూడా రాబోతుంది.
కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ‘దేవర’ నుంచి ఏ చిన్న అప్ డేట్ బయటకు వచ్చిన అభిమానులు సంబురపడిపోతున్నారు. ఎప్పుడెప్పుడూ బొమ్మ రిలీజ్ అవుతుందా అని హడావిడి చేస్తున్నారు. దేవరలో ఎన్టీఆర్ తండ్రికొడుకులుగా డబుల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన లుక్ లో చేతిలో ఆయుధంతో ఎన్టీఆర్ లుక్ ఫెర్రోషియస్ గా ఉంది. ఆ లుక్ ను చూసే ‘దేవర’ మాములుగా ఉండదు అనే అంచనాలకు ఫ్యాన్స్ ,ఆడియన్స్ వచ్చేశారు.
ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్ గా ఎన్టీఆర్ తో రొమాన్స్ చేయనుండగా, విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ కాంబినేషన్ ను చూస్తేనే తెలుస్తోంది. సౌత్ నే కాదు బాలీవుడ్ ను కూడా దేవర షేక్ చేయబోతుందని. ఇప్పటికే ఈ మూవీలో హలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇక 2024న తొలిరోజే ఈ సినిమా గురించి మేకర్స్ క్రేజీ అప్ డేట్ విడుదల చేశారు. ఈ మూవీ గ్లింప్స్ ను ఈనెల 8వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్ సైతం రిలీజ్ చేశారు. దీంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ పరిస్థితి పూనకాలు లోడింగ్ అన్నట్టుగా మారిపోయింది.