Homemain slidesహీరోయిన్లకు ఏడుపు..అదే మనకు ఎంటర్ టైన్ మెంట్!

హీరోయిన్లకు ఏడుపు..అదే మనకు ఎంటర్ టైన్ మెంట్!

భారత్ సమాచార్, సినీ టాక్స్ : మన ఆలోచనలు బట్టే సినిమా డైరెక్టర్లు కూడా క్యారెక్టర్లు, సీన్లు క్రియేట్ చేస్తుంటారు. మన తెలుగు డైరెక్టర్లు రోటిన్ గా ఫాలో అవుతున్న విషయం ఒకటుంది.. హీరోయిన్లను హీరో ఏడిపించే సీన్లు. ఇవే ఆడియన్స్, ఫ్యాన్స్ తెగ అలరిస్తూ ఉంటాయి. ఈ ఫార్ములా గతంలో ఎన్నె సినిమాల్లో ఉన్నా.. రవితేజ, పూరిల ‘‘ఇడియట్’’ నుంచి వర్కవుట్ బాగా అయ్యింది. ఈ ఏడిపించే ఫార్ములా కొన్ని వందల సినిమాల్లో వచ్చింది. అయితే కొన్ని సూపర్ హిట్ మూవీల గురించి మాత్రం చర్చిద్దాం.

ఇడియట్ మూవీలో హీరోయిన్ ను హీరో చస్తానని చెప్పి లవ్ లో పడేస్తాడు. ఇందులో విలన్ చేసే పనులన్నీ చేసి హీరోయిజం నిరూపించుకుంటాడు. అతడు హీరో కాబట్టి మనం అతన్ని ఫాలో అయిపోవాల్సిందే. అదే హీరో ఇతర అమ్మాయిని ఎవరైనా ఏడిపిస్తే..వాన్ని తన్నిపడేస్తాడు. తాను చేస్తే హీరో.. ఇతరులు చేస్తే విలన్. కానీ మనం హీరోను ఫాలో అవుతుంటాం కాబట్టి అవన్నీ పట్టించుకోక ఆ సీన్లను తెగ ఎంజాయ్ చేస్తుంటాం.

‘‘అర్జున్ రెడ్డి..’’ ఈ మూవీ పేరు లేకుండా ఈ లిస్టే ఉండదు లెండి. ఇందులో హీరో హీరోయిన్ ను ప్రేమ పేరుతో మాట్లాడే మాటలు, హీరోయిన్ తో ప్రవర్తించే విధానం.. అవన్నీ చేస్తే హీరోయిజం ఎక్కువన్నమాట. ఇలాంటి వాటికి ఈ సినిమా బ్రాండ్ అంబాసిడర్ అనే చెప్పుకోవాలి.

‘‘ఇస్మార్ట్ శంకర్ ’’లో హీరో హీరోయిన్ ను బూతులు తిడతాడు. అమ్మాయి వెనకాల పడతాడు. ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతాడు. కానీ ఆ అమ్మాయి చివరకు హీరోనే ఇష్టపడుతుంది. ఇక రీసెంట్ గా వచ్చిన ‘‘యానిమల్’’ లో హీరోయిన్ ను హీరో చూసిన విధానం అసలు బాగాలేదని విమర్శలు కూడా వచ్చాయి.

ఇలాంటి సీన్స్ ఇంకా..బిజినెస్ మేన్,  అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి, రెమో, నేను లోకల్, సర్కార్ వారి పాట.. ఇలా ఒకటేమిటి ఎన్నెన్నో హిట్ మూవీలు ఉన్నాయి. మన హీరో ఏం చేసినా నడుస్తుంది.. విలన్ ఏది చేసినా మన హీరో వెళ్లి తన్నాలంతే. అదే మనం కోరుకుంటాం. అదే హీరోయిజం మరి.

మరికొన్ని కథనాలు…

ప్రభాస్- అనుష్క పెళ్లి అందుకే ఆగిపోయిందట!

RELATED ARTICLES

Most Popular

Recent Comments