Homemain slidesసీవీ ఆనంద్ మరోసారి పదవి బాధ్యతల స్వీకరణ

సీవీ ఆనంద్ మరోసారి పదవి బాధ్యతల స్వీకరణ

భారత్ సమాచార్: హైదరాబాద్ సీపీగా సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌ సీపీగా ఆయన బాధ్యతలు చేపట్టడం రెండోసారి కావ డం గమనార్హం. బాధ్యతల స్వీకరణ అనంతరం సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ..

హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ ను మరింత మెరుగు పరుస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఒక భాగ మని పేర్కొన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుం దని.. నేరస్తులతో గట్టిగా పోలీసింగ్ పని చేస్తుందన్నారు. వినాయక నిమజ్జనం అనేది హైదరాబాద్‌లో కీలకమ న్నారు. వినాయక నిమజ్జ నం అనేది ప్రశాంతంగా అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది తాను ఇంకా ఫైల్ చూడలేదని సీవీ ఆనంద్ తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఒక్క సారి సమీక్ష నిర్వయిస్తామ న్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని విన్నానని సీవీ ఆనంద్ తెలిపారు. ట్రాఫిక్ సమస్యకు కూడా పరిష్కా రం చూపుతామన్నారు. హత్యలు, అత్యాచారాలు , లా అండ్ ఆర్డర్‌పై కఠినంగా వ్యవహరిస్తామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్.. హైద‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్‌గా నియామ‌కం కావ‌డం ఇదేమీ తొలిసారి కాదు. స‌రిగ్గా ఏడా ది క్రితం వ‌రకూ ఆనంద్.. హైద‌రాబాద్ సీపీగానే ఉండేవారు.

2021 డిసెంబ‌ర్ నుంచి 2023 అక్టోబ‌ర్ వ‌ర‌కూ హైద‌రాబాద్ సీపీగా ప‌ని చేశారు. తెలంగాణ కేడ‌ర్‌కు చెందిన సీవీ ఆనంద్.. 2017లో అదన‌పు డైరెక్టర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ పోలీసుగా ప‌దోన్నతి ఆయన కేంద్ర స‌ర్వీసుల‌కు వెళ్లారు. అనంతరం 2021లో తిరిగి తెలంగాణ‌కు చేరుకున్నారు. ఆయనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 ఆగ‌స్టులో డీజీపీ హోదా క‌ల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2023 ఎన్నిక‌ల స‌మ‌ యంలో ఆయ‌న‌ను సీపీ ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరిన త‌ర్వాత ఆనంద్‌కు ఏసీబీ డీజీగా బాధ్యత‌లు అప్పగించింది. ప్రస్తుతం తిరిగి హైద‌రాబాద్ సీపీగా సీవీ ఆనంద్ నియమితుల య్యారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments