July 28, 2025 6:18 pm

Email : bharathsamachar123@gmail.com

BS

Dalailama vs China: దలైలామా వారసుడి ఎంపిక.. డ్రాగెన్‌కు భారత్ కౌంటర్

భారత్ సమాచార్.నెట్: తన వారసుడిని నిర్ణయించే హక్కు భౌద్దమత గురువు దలైలామాకు మాత్రమే ఉంటుందని భారత్ స్పష్టం చేసింది. 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని పేర్కొంది. దలైలామా వారసుడిని నర్ణయించే అధికారం టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడికి తప్ప మెరెవరికీ ఆ హక్కు లేదని తేల్చి చెప్పింది. దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులందరికీ అత్యంత ముఖ్యమైనదని పేర్కొంది.

భౌద్దమత గురువు దలైలామా వారసుడి ఎంపికను బీజింగ్‌ ఆమోదించాలన్న చైనా డిమాండ్‌పై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులందరికీ అత్యంత ముఖ్యమైనది. తన వారసుడిని నిర్ణయించే హక్కు దలైలామాకే మాత్రమే ఉందని ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. దలైలామా తన వారసుడి ఎంపిక ప్రక్రియపై చేసిన ప్రకటన చైనాకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. తన వారసుడిని ఎంపిక చేసే అధికారం గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్టుకు మాత్రమే ఉందని.. ఇతరులకు ఆ హక్కు లేదని దలైలామ స్పష్టం చేశారు. దీంతో బీజింగ్ కోపం కట్టలు తెంచుకుంది. తమ ఆమోదముద్ర లేకుండా దలైలామ వారసుడిని ఎంపిక చేయకూడదని.. తమ చట్టాలకు అనుగుణంగా, చైనాలోనే ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టాలని డ్రాగెన్ స్పష్టం చేసింది. చైనా వ్యాఖలను దలైలామ తిప్పికొట్టారు. చైనా జోక్యాన్ని ఒప్పుకునేదే లేదని.. చైనా అవతల జన్మించిన వ్యక్తే తన వారసుడు అవుతాడని తేల్చి చెప్పారు.

Share This Post
error: Content is protected !!