Homemain slidesDeepika Padukone: బన్నీ-అట్లీ కాంబో మూవీలో దీపికా పడుకోణె

Deepika Padukone: బన్నీ-అట్లీ కాంబో మూవీలో దీపికా పడుకోణె

భారత్ సమాచార్.నెట్: అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న కొత్త సినిమా నుంచి అభిమానులకు సర్‌ప్రైజింగ్ అప్డేట్ వచ్చింది. బన్నీ కొత్త సినిమాలో బాలీవుడ్ బ్యూటీ (Bollywood Beauty) దీపికా పడుకోణె (Deepika Padukone) నటించనున్నారు. ఇందులో దీపిక ఓ సూపర్ ఉమన్ వారియర్ (Super Women Warrior) తరహా పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను సైతం సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. అయితే అసలైన చర్చ దీపిక పాత్ర గురించి కాదండి.. ఆమె ఎంపిక జరిగిన నేపథ్యం గురించీ, మధ్యలో జరిగిన పరిణామాల గురించీ.
ఎందుకంటే ఈ మధ్యనే ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. ఆ ప్రాజెక్ట్ అందినట్టే అంది చివరి నిమిషంలో ఆ ప్రాజెక్ట్ నుంచి దీపిక తప్పుకున్న సంగతి తెలిసిందే. ‘యానిమల్’ హిట్ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ‘స్పిరిట్’ కోసం దీపికను సంప్రదించారు. స్క్రిప్ట్ ఆమెకు నచ్చడంతో ఆమె పీఆర్ టీమ్ ఇప్పటికే పలు వెబ్‌సైట్లకు లీక్ చేస్తూ.. దీపిక పాత్ర ఎంత ప్రత్యేకమైందో హైప్ క్రియేట్ చేసింది.
అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో పరిస్థితి తారుమారు అయ్యింది. దీపిక తన పర్సనల్ టెర్మ్స్ వివరించగా దర్శకుడు ఒప్పుకోలేదట. రోజుకు కేవలం 8 గంటల షూటింగ్ మాత్రమే, రూ. 40 కోట్లు రెమ్యునరేషన్, లాభాల్లో షేర్ వంటి డిమాండ్లను ఆమె పెట్టిందట. అలాగే ఆమె పీఆర్ టీమ్ చేస్తున్న ప్రచారం కూడా సందీప్‌కు నచ్చలేదట. దీంతో అతను ఆమెను ప్రాజెక్ట్ నుంచి తొలగించి.. ట్రిప్టి డిమ్రీని హీరోయిన్‌గా ఫైనల్ చేశాడు. అంతటితో ఆగకుండా దీపికను ఉద్దేశిస్తూ తన ట్విట్టర్‌లో ఇండైరెక్ట్‌గా తిట్టేశాడు కూడా.
ఇలా ‘స్పిరిట్’ విషయంలో కాస్తా చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న దీపిక.. ఇప్పుడు అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్రాజెక్టులో భాగమవుతోంది. అయితే ఈ సినిమా మొదట మృణాల్ ఠాకూర్ పేరును పరిశీలించినట్లు సమాచారం. కానీ చివరకు దీపిక ఒత్తిడితోనే ఆమెను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, దీపిక అడిగిన కండీషన్లను దర్శకుడు అట్లీ అంగీకరించినట్లు భావిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. దీపికతో పాటు మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటించనున్నట్లు సమాచారం.
RELATED ARTICLES

Most Popular

Recent Comments