Homebreaking updates newsఏపీలో నేటి నుంచి డిగ్రీ ప్రవేశాలు

ఏపీలో నేటి నుంచి డిగ్రీ ప్రవేశాలు

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ;

ఆంధ్రప్రదేశ్ డిగ్రీ కోర్సుల్లో2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు సంభందించిన నోటిఫికేషన్ ను విద్యాశాఖ అధికారులు తాజాగా విడుదల చేశారు. రాష్ట్రంలో ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్ట్స్,సైన్స్, సోషల్సైన్సెస్,కామర్స్, మేనేజ్ మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ సోషల్వర్క్, ఆనర్స్ వంటి డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీచేయనుంది. ప్రభుత్వ, అటానమస్, ప్రైవేటు ఎయిడెడ్ ప్రైవేటు అన్ ఎయిడెడ్, ప్రైవేటు అటానమస్ కళాశాలల్లోని వివిధ కోర్సుల్లో ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు కల్పించనుంది. జూలై 2వ తేదీ నుంచి 10వ తేదీ వరకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. 5వ తేదీన కళాశాలల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆప్షన్ల ఎంపికకు అవకాశం ఉంటుందని చెప్పారు. 19వ తేదీన తుది సీట్ల కేటాయింపు జరుగుతుందని తెలిపారు.

కోర్సుల్లో సీట్లు పొందిన విద్యార్థులు 20వ తేదీ నుంచి 22వ తేదీ లోగా ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాలని సూచించింది. ప్రత్యేక కేటగిరీ విద్యార్థులు (దివ్యాంగులు ఎన్సీసీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఇతర కరిక్యులర్ యాక్టివిటీస్) సర్టిఫికెట్లను 4 నుంచి 6వ తేదీ వరకు పరిశీలించనున్నారు. ఈ విద్యార్థులు విజయవాడలోని ఎస్ఆర్ఆర్, విశాఖపట్నంలోని వీఎస్ కృష్ణకళాశాల, తిరుపతిలోని ఎస్వీ వర్సిటీలో ధ్రువపత్రాల పరిశీలకు హాజరుకావాల్సి ఉంటుంది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సంప్రదించాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.

మరికొన్ని వార్తా విశేషాలు…

ఏపీ టెట్-2024 నోటీపీకేషన్ విడుదల

 

RELATED ARTICLES

Most Popular