Homemain slides‘ప్రజాపాలన’ దరఖాస్తులు.. పలు అనుమానాలు!

‘ప్రజాపాలన’ దరఖాస్తులు.. పలు అనుమానాలు!

భారత్ సమాచార్, రాజకీయం : కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ‘అభయహస్తం’ పేరిట 6 గ్యారెంటీల అమలుకు ప్రజాపాలన పేరిట దరఖాస్తులు స్వీకరిస్తోంది. దరఖాస్తుల్లో ఎక్కువ మంది రేషన్ కార్డులు, గృహజ్యోతి, మహాలక్ష్మి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లకు పథకాల కోసం దరఖాస్తు ఫారాల్లో కోరుతున్నారు. అప్లయ్ చేసినవారిలోనూ, చేయని వారిలోనూ ఎన్నెన్నో సందేహాలు కలుగుతున్నాయి. వాటిపై అధికారులను అడిగిన వారూ తమకు తెలియదంటున్నారు. ఇప్పటికే రెండు రోజులు పూర్తయింది. 31,1వ తారీఖుల్లో సెలవు దినాలు. ఇక ఆ తర్వాత 5 రోజుల సమయయే ఉంటుంది. దీంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఇంకా కొందరికీ తాము ఎక్కడ దరఖాస్తు చేయాలనే సందిగ్ధంలోనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో వస్తున్న సందేహాలు కొన్ని ఇవి…

  •  రేషన్ కార్డు మా ఊరిలో ఉంది.. కుటుంబంతో సహ పట్టణంలో ఉంటున్నా.. నేను ఎక్కడ దరఖాస్తు చేయాలి?
  •  రేషన్ కార్డు యజమానిగా ఆడవాళ్ల పేరు ఉంది. దరఖాస్తును వారి పేరు మీదుగా నింపాలా? లేకుంటే ఇంటి యజమాని అయిన భర్త పేరు మీదుగా నింపాలా?
  • రేషన్ కార్డు ఊళ్లో ఉంది.. మేం పట్టణంలో దరఖాస్తు చేసుకోవచ్చా?
  • గ్యాస్ కనెక్షన్లు మగవారి పేరు మీద ఉన్నాయి.. సబ్సిడీ 500లకే సిలిండర్ రావాలంటే ఆడవారి పేరు మీదకు మార్పించాలా?
  • మాకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఊరిలో ఉంది. గ్యాస్ కనెక్షన్ పట్టణంలో ఉంది. ఎక్కడా అప్లయ్ చేసుకోవాలి.
  • మాకు ఊళ్లో పొలాలు ఉన్నాయి. రైతుభరోసా కింద అక్కడే అప్లయ్ చేసుకోవాలా?
  •  రైతుబంధు, పింఛన్లను ఇంతకుముందే పొందుతున్నాం. మేం మళ్లీ అప్లయ్ చేసుకోవాలా?
  • మహిళలకు రూ.2500 పథకంలో లబ్ధి పొందడానికి ఇంటిలో ఆడవాళ్లు అందరూ అర్హులేనా?
  •  ఇంతకు ముందు పింఛన్ లబ్ధిదారులు గృహలక్ష్మి కి కూడా అప్లయ్ చేసుకోవచ్చా?
  • పట్టణంలో ఇల్లు ఉంది. దానికి కరెంట్ మీటర్ ఉంది. పొలాలు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు గ్రామంలో ఉంది. గ్రామంలో దరఖాస్తు చేయాలా? పట్టణంలో చేయాలా? పట్టణంలో ఇంటికి గృహజ్యోతి వర్తిస్తుందా?

ఇలా ఎన్నెన్నో అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ప్రజలకు వచ్చే అనుమానాలను గుర్తించి క్లారిటీ ఇచ్చి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

ఆ యూట్యూట్ ఛానళ్లపై క్రిమినల్ కేసులు పెడతాం: కేటీఆర్

RELATED ARTICLES

Most Popular

Recent Comments