భారత్ సమాచార్.నెట్, తిరుమల: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తుంటారు. స్వామివారిని దర్శించుకుని తమ మొక్కలు చెల్లించుకుంటారు భక్తులు. స్వామివారి మొక్కలల్లో భాగంగా కొందరు భక్తులు బంగారం, వెండి, నగదు ఇలా కానుకలుగా సమర్పిస్తుంటారు కొందరు భక్తులు ఈ కానుకలను హుండీలో సమర్పిస్తుండగా.. మరికొందరు టీటీడీ అధికారులకు అందజేస్తుంటారు.
తాజాగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఖరీదైన కానుకల్ని అందజేశారు కొందరు చెన్నై భక్తులు. చెన్నైకి చెందిన సుదర్శన్ ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధులు శ్రీవారికి.. రూ.2.4 కోట్ల విలువ చేసే బంగారు శంఖు చక్రాలను విరాళంగా అందించారు. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో సుమారు 2.5 కిలోల బరువుతో కూడిన శంఖు చక్రాలను టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. అనంతరం వారిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు ఆలయ ఏఈవో.
ఇకపోతే తిరుమల శ్రీవారి ఆస్తులు అంతకంతకు పెరుగిపోతున్నాయి. హుండీ ఆదాయంతో పాటు రోజూ వస్తున్న కానుకలు, విరాళాలు, వేల టన్నుల బంగార ఆభరణాలు, కోట్ల డిపాజిట్లతో ఆపదమొక్కులవాడి ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. దీంతో తిరుమల శ్రీవారి ఆదాయం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. కాగా, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు వెంకన ఆదాయం సుమారు రూ.5 కోట్లు దాటినట్లు టీటీడీ ఇప్పటికే ప్రకటించింది.
To watch the Video click the Link Below:
https://x.com/i/status/1950068085186031830